వివాదాస్పద నటి శ్రీరెడ్డి రాజకీయలోకి రానుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. గతంలో క్యాస్టింగ్ కౌచ్ పేరుతో టాలీవుడ్ ని షాక్ చేసిన శ్రీరెడ్డి ప్రస్తుతం చెన్నైలో ఉంటుంది. ఈ మధ్య సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ టాలీవుడ్ టాప్ హీరోలను టార్గెట్ చేసింది శ్రీరెడ్డి. ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో మరికొన్ని విషయాలను పంచుకుంది. అగ్రనటులు, చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగార్జున అందరిపై కామెంట్స్ చేసింది.
సోషల్ మీడియా లో ఉదయనిధి స్టాలిన్ తో తనకు సంబందం ఉందంటూ వచ్చిన వార్తలపై కూడా శ్రీ రెడ్డి స్పందించింది. ఉదయనిధి స్టాలిన్ ను అసలు ఎప్పుడు కలవలేదంటూ చెప్పుకొచ్చింది. టాలీవుడ్ లో రీఎంట్రీ పై స్పందించిన శ్రీరెడ్డి తెలుగులో నటించాలనే ఆసక్తి లేదని, కానీ తొందరలోనే రాజకీయల్లోకి వస్తానంటూ చెప్పుకొచ్చింది. శ్రీ రెడ్డి రాజకీయాల్లోకి వస్తానంటూ చేసిన కామెంట్స్ ఇప్పుడు టాలీవుడ్, కోలీవుడ్ తో పాటు రాజకీయవర్గాల్లో కూడా చర్చనీంశంగా మారింది.