దొంగలున్నారు జాగ్రత్త అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు యంగ్ హీరో శ్రీ సింహ. మత్తు వదలరా సినిమా తరువత సరి కొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ ఫస్ట్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.
ప్రీతి అస్రాని హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో శ్రీసింహ ఒక దొంగగా నటించారు. ఫస్ట్ లుక్ పోస్టర్ లో హైవేపై కారు, నో టర్న్ సింబల్ , సీసీటీసీ కెమెరా, నేలపై కాగితం వంటివి చూపించారు మేకర్స్.
ఇక ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమా ఏ జానర్‌కు చెందినదో కూడా తెలియజేస్తుంది. కాల భైరవ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను డి సురేష్ బాబు, సునీత తాటి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
సతీష్ త్రిపుర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సముద్రఖని కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు.