అల్లు అర్జున్ పుష్ప: ది రైజ్ బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. అయితే ఈ సినిమా ఘన విజయం సాధించటంలో దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ప్రధాన పాత్ర పోషించిందనే చెప్పాలి. ఈ సినిమాలోని అన్ని పాటలు సంగీత ప్రియులను ఆకట్టుకున్నాయి.
అన్నింటికీ మించి శ్రీవల్లి సాంగ్ అందరికీ తెగ నచ్చేసింది. ఇప్పుడు ఈ పాట ఆంగ్ల వెర్షన్ అందుబాటులోకి వచ్చింది. ఎమ్మా హీస్టర్స్ ఈ సాంగ్ ను పాడారు. తెలుగు ప్రేక్షకులకు ఇది కాస్త అర్ధం కాకపోయినా ఒరిజినల్ శ్రీవల్లి సాంగ్ ఫీల్ మాత్రం వస్తుంది.
అదే విషయాన్ని ట్విట్టర్‌లో షేర్ చేస్తూ దేవి శ్రీ ప్రసాద్ ట్వీట్ చేశాడు.చాలా బాగుంది. సిద్ శ్రీరామ్ బ్రో మనం రికార్డ్ చేసినప్పుడు నేను మీకు చెప్పాను.
ఇంగ్లీష్ వెర్షన్ 4 ఫన్ చేద్దాం అని కానీ ఇక్కడ ఎమ్మా హీస్టర్స్ నుండి మంచి సాంగ్ వచ్చింది. మనం కూడా చేయాలి అంటూ చెప్పుకొచ్చాడు. ఇక సిద్ శ్రీరామ్ తెలుగు, తమిళం, కన్నడ మరియు మలయాళంలో శ్రీవల్లి పాటను పాడారు. హిందీ వెర్షన్‌కి జావేద్ అలీ పాడారు.