నటి శ్రియ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ లో ఉన్న అగ్ర హీరోల నుంచి కుర్ర హీరోల వరకూ అందరితోనూశ్రియసినిమాలు తీసింది. ఇక పెళ్లయిన తర్వాత కూడా అవకాశలు తలుపు తడుతున్నాయి. ప్రస్తుతం సుజనా రావు దర్శకత్వంలోశ్రియ ‘గమనం’ మూవీ లో నటిస్తుంది.
ఈరోజు శ్రియా పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రానికి ప్రముఖ రచయిత సాయిమాధవ్ బుర్రా సంభాషణలు రాస్తున్నారు.