శృతిహాసన్… అలనాటి నటుడు కమల్ హాసన్ కుమార్తె. సిద్దార్థ హీరోగా వచ్చిన అనగనగ ఓ ధీరుడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయింది. నటన పరంగా సినిమాలో మెప్పించినప్పటికీ సినిమా హిట్ కొట్టలేదు. ఆ తరువాత శృతిహాసన్ కు వరుస అవకాశాలు వచినప్పటికి ఒక్క సినిమా కూడా సరైన హిట్ సాధించలేదు. దీనితో శృతి హాసన్ ను ఐరన్ లెగ్ అంటూ తెగ ట్రోల్స్ చేశారు. ఆ తరువాత వచ్చిన గబ్బర్ సింగ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. అక్కడితో వరుస హిట్ లతో శృతిహాసన్ మంచి జోష్ చూపించింది. కానీ ప్రస్తుతం అవకాశాలు తగ్గాయనే చెప్పాలి. అవకాశాలకోసం ఎదురు చూస్తున్న శృతిహాసన్ తెగ ఫోటో షూట్ లు చేస్తుంది.