తెలుగులో తన అందంతో మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ శృతిహాసన్. టాలీవుడ్ లోని అగ్రహీరోలందరి సరసన నటించిన ఈ అమ్మడు తెలుగులో వచ్చిన అవకాశాలను వదులుకుని బాలీవుడ్ లో అడుగుపెట్టింది. అక్కడ బాలీవుడ్ లో అవకాశాలు వచ్చినప్పటికి కెరీర్ ను పక్కన పెట్టి ప్రేమలో పడింది శృతి. ప్రేమ కూడా విఫలం అవ్వటంతో మళ్ళీ ఈ బామ కెరీర్ వైపు దృష్టి పెట్టింది. తెలుగులో కూడా దొరికిన అవకాశాల కోసం ఎదురుచూస్తోంది.
తాజాగా మహేష్ బాబు, పైడిపల్లి వంశీ దర్శకత్వంలో రాబోతున్న సినిమాలో హీరోయిన్ గా శృతిహాసన్ ని ఎంచుకున్నారని సమాచారం. శ్రీను వైట్ల దర్శకత్వంలో మహేష్ బాబు తీసిన ఆగడు సినిమాలో శృతిహాసన్ ఓ ఐటమ్ సాంగ్ లో మెరిసిన సంగతి తెలిసిందే.