ప్రముఖ హీరోయిన్ శృతి హాసన్ గత కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం శృతి హాసన్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ హీరోగా నటిస్తున్న క్రాక్ సినిమాలో నటిస్తోంది. మరోవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వకీల్ సాబ్ సినిమాలో కూడా నటిస్తుంది.
అయితే తాజాగా ఇంస్టాగ్రామ్ వేదికగా శృతిహాసన్ సినీ అభిమానులకు, పవన్ అభిమానులకు ఓ విషయాన్ని తెలిపింది. పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాలు చేస్తుండడం సంతోషంగా ఉంది. ఆయన రీఎంట్రీ సినిమాలో నేను భాగమైనందుకు మరింత ఆనందంగా ఉంది. జనవరి నుంచి షూటింగ్ కు హాజరవుతాను. పవన్ తో మూడో సారి పని చేస్తున్నాను అని చెప్తూనే పవన్, సూర్య, రవితేజ వంటి హీరోలతో మాత్రమే నేను ఎక్కువగా నటించ చెప్పుకొచ్చింది శృతిహాసన్