కెరీర్ మొదలు పెట్టిన దగ్గర్నుంచి కమర్షియల్ ఫెయిల్యూర్ లేకుండా కొనసాగుతున్న దర్శకుడు రాజమౌళి. మొదటి సినిమా స్టూడెంట్ నంబర్ 1 నుంచి నిన్నమొన్నటి RRR వరకు సక్సెస్ గ్రాఫ్ డౌన్ ఫాల్ అన్నది లేకుండా చేసుకుంటూ పోయాడు.
అతును ట్వీట్ చేస్తే, ట్రైలర్ రిలీజ్ చేస్తే, వేరేవాళ్ళ సినిమాకి కొబ్బరికాయ కొడితే, సినిమా బావుందని వకాల్తా వీడియో చేస్తే శుభసూచకం. సక్సెస్ అవుతుందని ఒక స్థాయి నమ్మకం. ఏదో విషయం ఉందని విశ్వాసం. నెక్స్ట్ సినిమా అనౌన్స్ చేస్తే తీయబోయే కంటెంట్ మీద…మీడియాలో చర్చ.
ఇంత క్రేజ్ ఉన్న రాజమౌళి సినిమాలో ఒక ఫ్రేమ్ కనిపించినా సినీభాగ్యం అనుకునే నటీనటులు, సినీప్రియులు ఎంతోమంది ఉన్నారు. అలాంటి దర్శకధీరుడే సిచ్యుయేషన్ డిమాండ్ చేసి నటించిన సినిమాలు, పాత్రలు,పాటులు కొన్ని ఉన్నాయి. ఆ సినిమాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఆర్ఆర్ఆర్ (ఎత్తర జెండా పాట)
ఆర్ఆర్ఆర్ లో ఎత్తర జెండా పాట సందర్భంగా కనిపిస్తారు.
సై సినిమాలో నల్ల బాలు అనుచరుడుగా రాజమౌళి కనిపించారు.
రెయిన్ బో
రెయిన్ బో సినిమాలో కూడా రాజమౌళి అతిధి పాత్రలో కనిపించారు.
మగధీర (అనగనగా పాట)
మగధీర సినిమాలో అనగనగా అనే పాటలో కనిపిస్తారు.
బాహుబలి : ది బిగినింగ్ (వైన్ సెల్లర్)
బాహుబలిలో వైన్ సెల్లర్ గా కనిపిస్తారు.
మజ్ను
మజ్ను మూవీలో రాజమౌళి సందడి చేసారు.