
దర్శక ధీరుడు రాజమౌళి కరోనా నుంచి కొలుకున్నారు. రెండు వారాల క్వారంటైన్ పూర్తయిందని, ప్రస్తుతం తమ కుటుంబంలో ఎవరికీ కరోనా లక్షణాలు లేవని లేవని ఈ మేర ఆయన ట్వీట్ చేశారు. కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. అందరికీ నెగిటివ్ వచ్చిందని ఆయన పేర్కొన్నారు. ప్లాస్మాను దానం చేయడానికి సరిపడా యాంటీబాడీస్ ఏర్పడటానికి 3 వారాల సమయం పడుతుందని,అప్పటివరకూ వేచి ఉండమని డాక్టర్ సూచించినట్లు రాజమౌళి తెలిపారు. అయితే ఇటీవల తనతో పాటు కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు జూలై 29న రాజమౌళి ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. లక్షణాలు తక్కువగానే ఉండటంతో వారంతా అప్పటి నుంచి హోం ఐసోలేషన్‌లోనే ఉన్నారు.