దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోలుగా వస్తున్న మల్టీస్టారర్ సినిమా RRR. బాహుబలి వంటి సినిమా తరువాత రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా కావటంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో రాంచరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించగా ఎన్టీఆర్ కొమరం భీంగా నటిస్తున్నాడు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఎన్టీఆర్ షూటింగ్ సన్నివేశాలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. దానిపై రాజమౌళి కూడా కొంత సీరియస్ అయిన సంగతి తెలిసిందే.
ఈ లీకుల విషయంలో రాజమౌళి ఎంతో జాగ్రత్తగా ఉన్నప్పటికీ ఎన్టీఆర్ లుక్ బయటకు వచ్చేయటంతో షూటింగ్ స్పాట్ లో రాజమౌళి మరింతగా జాగ్రత్తలు తీసుకోవాలని అనుకుంటున్నాడట. దీనిపై ఎన్టీఆర్, రాంచరణ్ పై కూడా కొంత అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ఇక నుంచి షూటింగ్ స్పాట్ లో ఎవ్వరు మొబైల్ ఫోన్లు తీసురావటనికి వీలు లేదనికూడా రాజమౌళి చెప్పేశాడట. ఇక ఈసినిమా 2020 జులై 30 న విడుదల కానుంది. రాంచరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ నటిస్తుండగా, ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ బామ ఒలీవియా నటిస్తుంది.