డైరెక్టర్ రాజమౌళి… తెలుగు సినిమా స్థాయిని దేశవ్యాప్తం చేసిన దర్శకుడు. పైగా ఫ్లాప్ అంటూ తెలియని డైరెక్టర్. మరోవైపు డైరెక్టర్ శంకర్… తనకంటూ ప్రత్యేక శైలితో తానేంటో ఇప్పటికే నిరూపించుకున్న డైరెక్టర్. ఇప్పుడు ఈ ఇద్దరు ఒకరిపై ఒకరు పోటీ పడబోతున్నారు. దాంతో సినిమా వర్గాలు ఇంట్రెస్టింగ్‌గా ఎదురుచూస్తున్నాయి.
RRRతో వచ్చే సంక్రాంతి బరిలో ఉన్న రాజమౌళి… షూటింగ్‌పై ఫుల్ ఫోకస్ చేశారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా మల్టీ స్టారర్ కావటంతో భారీ అంచనాలున్నాయి. దేశంలోని అన్ని భాషలలో విడుదల చేసేందుకు సన్నాహకాలు నడుస్తున్న తరుణంలో… మరో స్టార్ డైరెక్టర్ శంకర్ కూడా సంక్రాంతి బరిలో ఉన్నారు. భారతీయుడు-2తో శంకర్ సంక్రాంతి రేసుకు సిద్ధమయిపోయాడు. శంకర్ సినిమా అంటే ఖచ్చితంగా అన్ని భాషలలో రిలీజ్ చేయటం మాములే. దీంతో ఇప్పుడు ఈ టాప్ డైరెక్టర్ల మధ్య పోటీతో నిర్మాతలు లోలోపల టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తోంది.
నిజానికి… కమల్ హసన్ భారతీయుడు సినిమా షూటింగ్ వాయిదాలు పడుతూ అనుకున్న సమయానికల్లా లేట్ అవుతూ వస్తుంది. దీంతో సంక్రాంతి బరిలో ఉండదనే అంతా అనుకున్నా… సంక్రాంతి రోజునే రిలీజ్ చేయాలని పట్టుదలతో ఉన్నాడట డైరెక్టర్ శంకర్. ఇప్పటికే ఐ, 2.0తో వరుస ఫ్లాప్‌లు నమోదు చేసిన ఆయన, ఈ సారి ఎలాగైనా భారీ హిట్ కొట్టాలన్న తపనతో ఉన్నట్లు తమిళ్ ఇండస్ట్రీ వర్గాల టాక్. భారతీయుడుకు సీక్వెల్‌గా రాబోతున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్‌తో పాటు రకుల్ ప్రీత్ సింగ్, సిద్దార్థ్‌లు కీ రోల్‌లో నటిస్తున్నారు.