సక్సెస్ ని ఇంటి పేరుగా మార్చుకుని, ఇండియన్ సినిమా గ్లోరిని ప్రపంచ స్థాయికి తీసుకొని వెళ్లాలనే కంకణం కట్టుకున్నవాడు ఎస్ఎస్ రాజమౌళి. సినిమా సినిమాకి మార్కెట్ ని పెంచుకుంటూ.. మూవీ మేకింగ్ స్టాండర్స్ ని పెంచుతూ తెలుగు సినిమాని పాన్ ఇండియాగా చేశాడు రాజమౌళి. ఇప్పుడు ఇండియన్ సినిమాని గ్లోబల్ వేదికపై నిలబెట్టాడు. ప్రతి భారతీయుడు గర్వించేలా ‘న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ బెస్ట్ డైరెక్టర్’ అవార్డును రాజమౌళి గెలుచుకున్నాడు.
ఈ అవార్డును గురువారం హాలీవుడ్ ప్రముఖుల సమక్షంలో అందుకున్నాడు. ఈ ఈవెంట్ కి శోబు యార్లగడ్డ, రమా రాజమౌళి, కార్తికేయ ఇతర కుటుంబ సభ్యులతో రాజమౌళి హాజరయ్యారు. ట్రెడిషనల్ ఇండియన్ వేర్ లో అవార్డ్స్ ఈవెంట్ కి వెళ్లాడు రాజమౌళి. అనంతరం చిన్న స్పీచ్ కూడా ఇచ్చాడు.
ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ.. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా విషయంలో ఇండియన్స్ ఎలా రియాక్ట్ అయ్యారో.. వెస్ట్ ఆడియన్స్ కూడా అలానే రియాక్ట్ అయ్యారు. అలాంటి రియాక్షన్ ని వెస్ట్ ఆడియన్స్ నుంచి ఊహించలేదు. ఇంటర్వెల్ సీన్ లో ఎన్టీఆర్.. జంతువులతో పోటీకి దిగే సీన్ నన్ను చాలా ఎగ్జైట్మెంట్ కి గురి చేసింది. అదే ఎగ్జైట్మెంట్ ఆడియన్స్ కూడా ఫీల్ అవ్వాలి అనుకున్నా. అందరూ ఆ సీన్ కి బాగా కనెక్ట్ అయ్యారు.. అంటూ రాజమౌళి పేర్కొన్నాడు.
కాగా రేస్ టు ఆస్కార్ లో ఉన్న ఆర్ఆర్ఆర్ కి క్రిటిక్స్ సర్కిల్ అవార్డ్ రావడం చాలా గొప్పవిషయం. గోల్డెన్ గ్లోబ్ అవార్డ్సులో కూడా రెండు నామినేషన్స్ సాధించింది ఆర్ఆర్ఆర్. అక్కడ కూడా అవార్డులను గెలిస్తే.. మన ఇండియన్ సినిమా ఆస్కార్ కి అడుగు దూరంలో నిలిచినట్లు అవుతుంది. మరి గోల్డెన్ గ్లోబ్ అవార్డ్సులో.. మన సినిమా అవార్డులను గెలుచుకుంటుందో లేదో తెలియాలి అంటే జనవరి 11వ తేదీ వరకూ ఆగాల్సిందే. ఈ కార్యక్రమానికి ఆర్ఆర్ఆర్ మూవీ టీం అంతా కలిసి హాజరుకానున్నారు.