యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం రాధే శ్యామ్. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన సాంగ్, టీజర్ ట్రైలర్ అన్ని కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అయితే ఇప్పుడు ఈ చిత్రానికి మరింత బలం చేకూరబోతోంది.
ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ను ఎస్ ఎస్ తమన్ అందించబోతున్నారు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ను చిత్ర యూనిట్ చేసింది. సౌత్ భాషలకి గానూ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ను తమన్ అందించనున్నారు. ఇక జనవరి 14,2022 లో రిలీజ్ కాబోతుంది.