టాలీవుడ్ లో ప్రస్తుతం దేవిశ్రీ, థమన్ ల మధ్య పోటీ నువ్వా నేనా అనే విధంగా ఉంది. అయితే మొన్నటి వరకు దేవిశ్రీ సినిమాకు సంగీతం ఇచ్చాడంటే ఆ సినిమా మ్యూజికల్ గా హిట్ అని చెప్తుంటారు. అందుకే దేవిశ్రీ కి పెద్ద మొత్తంలో దర్శక , నిర్మాతలు రెమ్యునిరేషన్ లు ఇచ్చి సినిమాకు పనిచేయించుకుంటారు. అయితే ప్రస్తుతం దేవి శ్రీ హవా తగ్గిందనే చెప్పాలి.దీనితో ఛాన్స్ లు తగ్గిపోయాయి. మరో పక్క థమన్ ఒక్కసారిగా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఎక్కడ విన్నా థమన్ పాటలే వినిపిస్తున్నాయి. యంగ్ హీరోల దగ్గర నుండి సీనియర్ హీరోలు సైతం థమన్ ను కోరుకుంటున్నారు.
తాజాగా థమన్ ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ..దేవిశ్రీ ప్రసాద్ తో తనకు పోటీ నిజమే. కాని అది వ్యక్తిగతంగా కాదు. ఆయనతో పోటీ పడ్డప్పుడు మాత్రమే నేను మంచి సంగీతాన్ని ఇవ్వగలను. అందుకే నేను సంగీత దర్శకులతో పోటీ పడుతాను. ప్రతి ఒక్క సంగీత దర్శకుడు కూడా నాకు పోటీగా భావిస్తాను. అప్పుడే మంచి సంగీతాన్ని ప్రేక్షకులకు ఇవ్వగలను అనే నమ్మకం ఉందని చెప్పుకొచ్చాడు థమన్ .