పవన్ కళ్యాణ్ ఈ పేరుకు ఉన్న క్రేజ్ టాలీవుడ్ లో ఇంకెవ్వరికి ఉండదు అంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు ఈ పేరు ఎందుకు చెప్తున్నా అనుకుంటున్నారా… పవన్ ఎక్కువ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటారు. ట్విట్టర్ వేదికగా ఎక్కువగా స్పందిస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ ను 39 లక్షల మంది ఫాలో అవుతుంటే పవన్ మాత్రం 33 మందిని ఫాలో అవుతున్నారంటే ఆయన క్రేజ్ ఏ రేంజ్ లో ఉందొ అర్ధమవుతుంది. అయితే ఆయన ఫాలో అవుతున్నవాళ్లలో చిరు, రాంచరణ్, సాయిధరంతేజ్, అమితాబ్ మినహా సినీఇండస్ట్రీకి చెందిన వారు ఎక్కువగా లేరు.
పవన్ ఎక్కువగా రాజకీయ ప్రముఖులు మోడీ, అమితాషా, నడ్డా, రాంనాథ్ కోవింద్ లాంటి వాళ్ళను ఫాలో అవుతుంటారు. ఇప్పుడు ఆ జాబితాలోకి మ్యూజిక్ డైరెక్టర్ థమన్ చేరిపోయాడు . పవన్ థమన్ ను ట్విట్టర్ లో ఫాలో అవుతున్న విషయాన్నీ తమన్ ట్విట్టర్ ద్వారా తెలిపాడు.ఒక ఫాన్స్ కు ఇది చాలా పెద్ద గొప్ప విషయం.. ఇవాళ్టి నా రోజు చాలా గొప్పగా ప్రారంభమైంది సార్ అంటూ ట్వీట్ చేశాడు థమన్. దీనితో థమన్ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది.
One of the biggest happiesttttttttttt fannnnnnnnnnnnnnnnnnnnnn
moment
Can’t get a bigger way to start the day .
Sirrrrrrrrrrrr ♥️Lots of gratitude & respect sir
Love U sir
God bless ✊ pic.twitter.com/fX5CTClbLi— thaman S (@MusicThaman) April 4, 2020