కాపీ కాట్ అంటూ ఎన్ని విమర్శలొచ్చినా… తనేంటో నిరూపించుకున్న సంగీత దర్శకుడు ఎస్.ఎస్ థమన్. ముఖ్యంగా అల వైకుంఠపురములో మ్యూజికల్ హిట్ తో థమన్ రేంజ్ మారిపోయింది.
‘సామజవరగమనా’, ‘బుట్టబొమ్మా’, ‘రాములో రాములా’ అంటూ షేక్ చేశాడు. ఇప్పటికే వి సినిమాకు మంచి మార్కులు పడగా… పవన్ కం బ్యాక్ మూవీ వకీల్‌సాబ్, మహేష్ బాబు సర్కారు వారి పాటకు కూడా థమన్ స్వరాలు సమకూర్చుతున్నారు. ఇలా థమన్ చేతిలో ఏకంగా 10సినిమాలున్నాయి. మరో 5 సినిమాలపై చర్చలు నడుస్తున్నాయి.
త్వరలో రిలీజ్ కాబోయే క్రాక్, పవన్ మరో రీమేక్ మూవీ అయ్యపురం కోష్యిం, బాలయ్య-బోయపాటి కాంబోలో వస్తున్న సినిమాకు కూడా థమనే మ్యూజిక్ డైరెక్టర్. వీటితో పాటు వరుణ్ తేజ్ కొత్త మూవీ, నాని టక్ జగదీష్, పునీత్ రాజ్ కుమార్ యువరత్న, శింబు ఈశ్వరన్ తో పాటు కదువ అనే మలయాళీ ప్రాజెక్ట్ చేస్తున్నారు థమన్.