స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) భారీ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఏటా ఈ సంస్థ మంత్రిత్వ శాఖలు, సంస్థల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియను నిర్వహిస్తోంది. ఇప్పటికే ఈ ఏడాది కొన్ని పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసిన ఎస్ఎస్సీ.. తాజాగా మరో భారీ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.
కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ స్థాయిలో మరో 1600కు పైగా ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇందులో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, స్టారింగ్ అసిస్టెంట్స్, లోయర్ డివిజన్ క్లర్క్, డేటా ఎంట్రీ ఆపరేటర్ తదితర పోస్టులు ఉంటాయి. వీటికి ఇంటర్ పాస్ అయి ఉండాలి. ఇంటర్ రెండో ఏడాది చదివే వారు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ పోస్టులకు ఆన్ లైన్ లోనే దరఖాస్తు చేసుకోవాలి. ఈ ఎగ్జామ్ ఫీజు జనరల్, ఓబీసీ కేటగిరీ వాళ్లకు రూ.100, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీసు మెన్, మహిళలు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఒక వయస్సు 18-27 లోపు అయి ఉండాలి.
ఈ పోస్టులకు సిలబస్ ఏంటంటే.. జనరల్ ఇంటెలిజన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్ నెస్, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ ఉన్నాయి, ఆబ్జెక్టివ్ మల్టీపుల్ చాయిస్ విధానంలో ప్రశ్నలు ఉంటాయి. అలాగే నెగిటివ్ మార్కింగ్ విధానం కూడా ఉంది. ఇక పోస్టును బట్టి జీతం రూ.19 వేల నుంచి ప్రారంభమై రూ.81,000 వరకూ ఉంటుంది.