రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయ శాంతి భద్రతలపై ప్రశ్నలు రేకెత్తు తున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. దీనివల్ల దక్షిణ, ఆగ్రేయాసియా దేశాల మధ్య సహకారం ప్రధాన్యతగా మారిందని ఆయన అన్నారు.
బిమ్ స్టెక్ ఐదవ శిఖరాగ్ర సమావేశంలో బుధవారం ఆయన మాట్లాడుతూ.. మన ప్రాంతం ఆరోగ్య, ఆర్థిక, భద్రతా అంశాల్లో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో దక్షిణ, ఆగ్నేయాసియా దేశాల మధ్య ఐకమత్యం, సహాకారం చాలా అవసరం అన్నారు.
బిమ్ స్టెక్ కు ఆపరేషనల్ బడ్జెట్ కోసం భారత్ తరఫున 1 మిలియన్ డాలర్లను అందజేయనున్నట్టు ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా బిమ్ స్టెక్ దేశాల మధ్య పరస్పర వాణిజ్యాన్ని పెంపొందించేందుకు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల ప్రాధన్యత గురించి ఆయన వివరించారు.
బంగాళాఖాతాన్ని కనెక్టివిటీ, శ్రేయస్సు, భద్రతల వారధిగా మార్చే సమయం ఆసన్నమైందన్నారు. 1997లో మనం కలిసి సాధించిన లక్ష్యాలను సాధించేందుకు కొత్త ఉత్సాహంతో పనిచేయడానికి మనకు మనం అంకితం చేసుకుందామని బిమ్ స్టెక్ దేశాలకు ఆయన పిలుపు నిచ్చారు.