ఇండియాలో బంగారానికి ఉన్న డిమాండ్ మరేదేనికి ఉండదు. ముఖ్యంగా మహిళలు బంగారం అంటే పడిచచ్చిపోతారు. అయితే గత మూడు రోజుల నుంచి తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు తాజాగా అదే స్థాయిలో స్థిరంగా నమోదయ్యాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ ధరల ప్రకారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 43,990 కి చేరింది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 47,990 కి చేరింది.
బంగారం ధరలు ఇలా ఉండగా… వెండి ధరలు మాత్రం పెరిగాయి. కిలో వెండి ధర రూ. 200 పెరిగి రూ. 63,200కి చేరింది.