వైద్యురాలు దిశ పై చోటు చేసుకున్న సంఘటన పై యావత్తు దేశం దృష్టి సారించి.. ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకూడదని వివిధ స్దాయిలలో ఆందోళనలు చేసిన విషయం అందరికి తెలిసిందే. నిందితులకు తగిన శిక్ష విదించాలంటు భూమి, ఆకాశం ఒకటైన విధంగా ఆందోళనలు చేయడంతో పోలీసులు ఆ నల్గురు నిందితులను కస్టడికి తీసుకొని ఎన్ కౌంటర్ చేయడం జరిగింది. మరోవైపు దిశ కు సంబందించిన ఏ వార్త వచ్చిన ప్రజలు అత్యంత ఆసక్తి చూపడంతో సినీ యాక్టర్లు కూడ దిశ ఘటన పై తమతమ స్దాయిలో స్పందించారు.
తాజాగా దిశ పై సినిమా తీసేందుకు చిత్ర సీమ ఆలోచన చేస్తుంది. ప్రముఖ పేరు ఉన్న హీరోయిన్ తో చిత్రికరించేందుకు ప్రముఖ ధర్శక నిర్మాతలు ఆలోచనలో పడినట్లు ఫిలింనగర్ లో చర్చలు జరుగుతున్నాయి. ఈ సినీమా నిర్మాణంలో మహబూబ్ నగర్ జిల్లా పేరుతో పాటు శంషాబాద్, తొండుపల్లి టోల్, చటాన్ పల్లి, పేర్లతో పాటు దిశ ఘటన సమయంలో ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించిన మీడియా, సోషల్ మీడియా వారిని కూడ చూపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సినీ గుసగుసలు వినిపిస్తున్నాయి.