ఎంతటి సినీ రాజకీయ ప్రముఖులు అయినా సరే ముహూర్తాల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటారు. జ్యోతిష్యులు చెప్పే అంశాలను సీరియస్ గా తీసుకుని అడుగులు వేస్తూ ఉంటారు. ఇలా చేయక నష్టపోయిన వారు కూడా ఉన్నారని మనం వింటూనే ఉంటాం. సిఎం కేసీఆర్ ఏ స్థాయిలో ఉన్నా సరే ఆయన జ్యోతిష్యులను బలంగా నమ్ముతూ ఉంటారు. సినిమా హీరోలు కూడా ఈ విషయంలో ముందున్నారు.
Also Read: పదేళ్ళ క్రితమే మహేష్, రాజమౌళి సినిమా రావాల్సిందా…?
అప్పట్లో ఎన్టీఆర్ విషయంలో ఇటువంటివి కాస్త ఎక్కువగా వినేవాళ్ళు. ఆయన దైవ భక్తి ఎక్కువగా ఉంటుంది అనే మాట ఇప్పటికీ వినపడుతుంది. ముహూర్తాలను, జాతకాలను బలంగా నమ్మేవారు. అయితే ఆయన మొండిగా చేసిన ఒక పని మాత్రం కలిసి రాలేదని అంటారు. విఠలాచార్య అని అప్పట్లో ఒక సీనియర్ దర్శకుడు ఉండేవారు. ఆయన సినిమాల్లో ఎన్టీఆర్ ఎక్కువగా నటించారు.
Also Read: ఈ స్టార్ కమెడియన్ రెమ్యునరేషన్ తెలిస్తే షాక్ అవ్వడమే…!
ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చే ముందు ఆయనకు గజారోహణం ఉందని విఠలాచార్య చెప్పడం జరిగింది. అయితే ఆయనకు ఎన్టీఆర్ కు మధ్య కొన్నాళ్ళు గ్యాప్ వచ్చింది. విఠలాచార్య సినిమా ఖర్చు తగ్గించడం కోసం గానూ యంగ్ హీరోలను ప్రోత్సహించారు. అప్పుడు ఎన్టీఆర్ కు నచ్చలేదు. ఎన్టీఆర్ ఒక రోజు ఆయనకు ఫోన్ చేసి… తన జాతకం అడిగారట. అప్పుడు రెండో వివాహం అనే ఆలోచన లేకుండా ఆడాళ్ళకు దూరంగా ఉండాలని ఎన్టీఆర్ కు ఆయన సలహా ఇచ్చారు. కాని ఆ మాటను ఎన్టీఆర్ లెక్క చేయలేదు.