దర్శక ధీరుడు రాజమౌళి సినిమా వస్తుంది అంటే చాలు ప్రేక్షకులకు ఉండే అంచనాలు అన్నీ ఇన్నీ కాదు. సినిమా విషయంలో ప్రేక్షకులు ప్రతీ వార్త కోసం ఎదురు చూస్తారు. బాహుబలి సినిమా తర్వాత ఆ క్రేజ్ రాజమౌళికి మరింత పెరిగింది. పార్ట్ 1, పార్ట్ 2 సినిమాలు ఒక రేంజ్ లో హిట్ అయ్యాయి. ఇక ఇదిలా ఉంచితే ఇప్పుడు మహేష్ బాబుతో ఆయన సినిమా చేస్తున్నారు.
Also Read:మునుగోడు బై ఎలక్షన్: కాళ్లు మొక్కుతూ NSUI వినూత్న ర్యాలీ
ఆర్ఆర్ఆర్ సినిమా మంచి హిట్ కావడంతో రాజమౌళి ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇక మహేష్ సినిమాకు సంబంధించి కథలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మహేష్ బాబు కూడా రాజమౌళి సినిమా కోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నాడు అని చెప్పాలి. ప్రస్తుతం త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్న మహేష్… ఆ సినిమా పూర్తి అయిన తర్వాత… రాజమౌళి సినిమా షూట్ కి వెళ్లనున్నారు.
ఈ సినిమాలో ముందు లేడీ విలన్ అనుకున్నా… స్టార్ హీరోని తీసుకునే ప్లాన్ చేస్తున్నారు. బాలకృష్ణ, కమల్ హాసన్ పేర్లు వినపడగా… వాళ్ళు నో చెప్పారని అంటున్నారు. దీనితో కార్తీ పేరుని పరిశీలించిన జక్కన్న… కార్తీని ఫైనల్ చేసారని తెలుస్తుంది. కథ చెప్పగా కార్తీ కూడా ఓకే అన్నాడని టాక్. తమిళంలో ఈ సినిమాకు క్రేజ్ రావడానికి కమల్ హాసన్ ని కూడా గెస్ట్ రోల్ లో చూపించే ప్లాన్ చేస్తున్నారట.
Also Read:నా నామినేషన్ రిజెక్ట్ చేస్తే.. ఎన్నికే జరగనివ్వను: కేఏ పాల్