మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సంచలన దర్శకుడు శంకర్ దర్శకత్వంలో సినిమా పట్టలెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. దిల్ రాజు బ్యానర్ లో ఈ సినిమా 50వ సినిమా కాగా చరణ్ కు 15 సినిమా. ఇదిలా ఉండగా ఈ సినిమాలో చరణ్ తో పాటు ఎవరెవరు నటిస్తున్నారు అనేది ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో మరో హీరో విలన్ పాత్ర పోషించబోతున్నారట.
అయితే ఆ హీరో ఎవరు అనేది మాత్రం తెలియరాలేదు. తెలుగు హీరోనా లేక తమిళ, కన్నడ హీరోనా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ప్రస్తుతం రామ్ చరణ్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ సినిమా చేస్తున్నాడు. అలాగే కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో కూడా నటిస్తున్నాడు.