పూరి జగన్నాథ్ తో సినిమా చేసిన తర్వాత ఎలాంటి స్టార్ హీరో ఇమేజ్ అయినా సరే మరో రేంజ్ కు వెళ్తుంది అనే మాట వాస్తవం. అప్పటి వరకు హీరోలో ఉన్న టాలెంట్ ఒకటి అయితే పూరి బయటకు తీసే టాలెంట్ మరొకటి ఉంటుంది. అప్పటి వరకు ఎన్ని అంచనాలు ఉన్నా సరే… హీరోని పూరి చూపించే విధానమే భిన్నంగా ఉంటుందనే మాట వాస్తవం.
Also Read:మెట్రో స్టేషన్ అండర్ గ్రౌండ్ లో ప్రసవం
ఏ హీరోని అయినా సరే ధైర్యంగా తనకు నచ్చే విధంగా మార్చుకోవడం ఆయనకు మాత్రమే చెల్లింది. బాలకృష్ణ, మహేష్ లాంటి హీరోలను సైతం తనకు నచ్చిన విధంగా మార్చుకుని సినిమాలు చేయించాడు. ఇక అల్లు అర్జున్ హీరోగా వచ్చిన దేశ ముదురు సినిమా అయితే మరో లెవెల్ లో ఉంటుంది. అప్పటి వరకు స్టైలిష్ స్టార్ గా ఉండే అల్లు అర్జున్ కు… ఆ సినిమా తర్వాత ఇమేజ్ మారింది.
అతని విషయంలో అభిమానుల అంచనాలు కూడా మారాయి. 2007 సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. 90 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది ఈ సినిమా. అక్కడి నుంచి అల్లు అర్జున్ తో సినిమా చేయడానికి స్టార్ దర్శకులు వెంటపడ్డారు. ఈ సినిమాలో రమాప్రభ కామెడి ఒక రేంజ్ లో హైలెట్ అయింది. అయితే ఈ సినిమా కథను ముందు బన్నీ కంటే కూడా సుమంత్ కు చెప్పారట.
పూరి జగన్నాథ్, త్రివిక్రమ్ ఇద్దరూ కలిసి ఈ సినిమా చేయాలన్ని అడిగారట. అయితే హీరో సన్యాసిని ప్రేమించడం ఏంటీ అనేది సుమంత్ కు లాజికల్ గా చెప్పలేదు. జస్ట్ ఒక లైన్ మాత్రమే చెప్పడంతో సుమంత్ నచ్చకపోవడం తో వదిలేసాడు. అదే కథను కొంచెం మార్చి బన్నీకి చెప్తే బన్నీ వెంటనే ఓకే చేసాడు.
Also Read:టీటీడి హుండీ కొత్త రికార్డ్