సినిమా పరిశ్రమలో ఒకసారి అడుగు పెట్టిన తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే సరైన నిర్ణయాలు తీసుకుంటే సినిమా పరిశ్రమలో మంచి అవకాశాలు వస్తాయి. అయితే కొందరు హీరోలు మాత్రం ఈ విషయంలో చాలా వరకు తప్పులు చేస్తూ ఉంటారనే మాట వాస్తవం. అలా తప్పులు చేసి లేదా వేరే వాళ్ళ మీద ఆధారపడే వాళ్ళు కెరీర్ ను నాశనం చేసుకుంటారు. అలా చేసుకున్న వారిలో హీరో ప్రశాంత్ ముందు వరుసలో ఉంటాడు.
Also Read:డామిట్.. కథ అడ్డం తిరిగింది.. కేసీఆర్ కు షాకిచ్చిన ఆప్..!
ఒకప్పుడు స్టార్ హీరోగా ఒక వెలుగు వెలిగిన ప్రశాంత్ తన కెరీర్ లో అనుకున్నది సాధించలేదు. జీన్స్, ఐలవ్యూ, తొలి ముద్దు, ప్రేమ శిఖరం వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు ఆయన దగ్గరయ్యాడు. ఇక మలయాళం, హింది, తమిళ సినిమాల్లో కూడా ఆయన నటించి మెప్పించారు. జీన్స్ లో ఆయన నటన ఒక రేంజ్ లో ఉంటుంది. ఐశ్వర్యారాయ్ నటించిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది.
అయితే తండ్రి త్యాగరాజన్ నిర్ణయాలతో అతను బాగా ఇబ్బంది పడ్డాడు. ప్రశాంత్ వ్యవహారాలు అన్నీ ఆయనే చూసుకునే వాడు. ఒక సినిమా హిట్ అయితే ప్రశాంత్ రెమ్యునరేషన్ భారీగా పెంచే వాడు. ఇక ప్రశాంత్ తో సినిమా చేయాలి అనుకుంటే ముందుగా ఆయన తండ్రితోనే మాట్లాడాలి. దీనితో ఆ రెమ్యునరేషన్ దెబ్బకు నిర్మాతలు, దర్శకులు బాగానే ఇబ్బంది పడేవారు. ఆయనతో సినిమాలు చేయడానికి కూడా ఎవరూ ముందుకు రాలేదు.
ఇక కొన్నాళ్ళకు… ఒక వ్యాపారవేత్త కూతుర్ని పెళ్లి చేసుకున్న ప్రశాంత్… తండ్రి మాటనే ఎక్కువగా వినే వారు. తండ్రి ఏం చెప్తే అదే చేసారు. దీనితో విసిగిపోయిన ప్రశాంత్ భార్య… ఒక సందర్భంలో నేను కావాలా మీ నాన్న కావాలా తేల్చుకోవాలని చెప్పేసింది. చివరకు తండ్రి కావాలని తండ్రి మాట విని భార్యకు విడాకులు ఇచ్చాడు. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టినా ఆయన గ్లామర్ మొత్తం పాడైపోయింది. సినిమాలకు చాలా వరకు దగ్గర కావాలని చూసినా సరే ఆఫర్లు కూడా పెద్దగా రావడం లేదు.
Also Read:టీజర్… గాలి జనార్దన్ రెడ్డి కొడుకు సినిమా స్టార్ట్