సినిమా పరిశ్రమలో పెళ్ళిళ్ళు అంటే ఎక్కువగా ప్రేమ పెళ్ళిళ్ళు ఉంటాయి. గతంలో అంటే బంధువుల అమ్మాయి లేదా మరొకరిని చేసుకునే వాళ్ళు గాని ఇప్పుడు మాత్రం దాదాపుగా అన్ని ప్రేమ కథలే ఉంటున్నాయి అని చెప్పాలి. పాత హీరోలు అయితే మరదలిని కూడా పెళ్లి చేసుకునే వాళ్ళు. అలా మరదల్ని పెళ్లి చేసుకున్న హీరోలను ఒకసారి చూస్తే…
Also Read:దసరా పూజా… కీర్తి తో నాని
ఎన్టీఆర్
విశ్వ విఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ సొంత మేనమామ కుమార్తె అయిన బసవ తారకంను వివాహం చేసుకున్నారు. ఆమె కూడా ఎన్టీఆర్ ను పట్టుబట్టి మరీ పెళ్లి చేసుకున్నారట.
సూపర్ స్టార్ కృష్ణ
సూపర్ స్టార్ కృష్ణ కూడా తన మరదలు ఇందిరా దేవిని వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత కొన్నాళ్ళకు ఇద్దరి మధ్య విభేదాలు వచ్చి విడిపోయారు. స్టార్ హీరోగా ఒక ఇమేజ్ వచ్చిన తర్వాత విజయ నిర్మలకు కృష్ణ బాగా దగ్గరయ్యారు.
మోహన్ బాబు
తన మొదటి భార్య మరణం తర్వాత ఆమె సోదరిని ఆయన పెళ్లి చేసుకున్నారు. ప్రమాదవ శాత్తు మొదటి భార్య ప్రాణాలు కోల్పోయిన తర్వాత నిర్మలా దేవిని వివాహం చేసుకున్నారు. మొదటి భార్యకు లక్ష్మీ ప్రసన్న, మంచు విష్ణు కాగా రెండో భార్యకు మంచు మనోజ్ పుట్టారు.
ఆది సాయి కుమార్
సాయి కుమార్ నట వారసుడిగా సినిమాల్లోకి వచ్చిన ఆది కూడా తన సొంత మరదిలిని వివాహం చేసుకున్నాడు.
కార్తి
సూర్య తమ్ముడు, తమిళ స్టార్ హీరో కార్తి కూడా సొంత మరదలు రజనీని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.
Also Read:ఆంధ్రా కాంట్రాక్టర్లకు కేసీఆర్ ఊడిగం చేస్తున్నారు- వివేక్