టాలీవుడ్ లో ఉన్న ప్రతి హీరో కెరీర్ లో కూడా హిట్ ప్లాప్ లు ఉంటాయి. మరికొన్ని సినిమాలు అట్టర్ ఫ్లాప్ అవుతుంటాయి. ముఖ్యంగా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన చిత్రాలు థియేటర్స్ లో రిలీజ్ అయితే ఆ సందడి మామూలుగా ఉండదు. కానీ ఏమాత్రం తేడా కొట్టినా ఇంక నిర్మాత పని అంతే!!
దీనికి ఎగ్జాంపుల్ రెండు సినిమాలను చెప్పుకోవచ్చు. ఒకటి బాహుబలి, భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. నిర్మాతలకు లాభాలను తెచ్చిపెట్టింది. అలాగే మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన ఖలేజా, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది. కానీ ఈ సినిమా తర్వాత టీవీల లో చూసిన వారు ఈ సినిమా ఫ్లాప్ కావడం ఏంటి అని అందరూ అనుకున్నారు. ఇలా కారణం ఏదవని ఒక్కోసారి ఒక్కో విధంగా జరుగుతూ ఉంటుంది.
ఇలా టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి నుంచి యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరకు అందరిలోనూ అనుకోని, ఊహించని అట్టర్ ఫ్లాప్ సినిమాలు ఉన్నాయి.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా 1995లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బిగ్ బాస్ అలాగే 2001 లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మృగరాజు సినిమాలు బాక్సాఫీస్ వద్ద తీవ్ర నిరాశను మిగిల్చాయి. అలాగే నందమూరి బాలకృష్ణ కెరీర్ లో ఒక్క మగాడు,పరమవీరచక్ర సినిమాలు పూర్తి డిజాస్టర్ గా మిగిలాయి.
ఇక విక్టరీ వెంకటేష్ కెరీర్ లో 2001లో వచ్చిన దేవి పుత్రుడు సినిమా పూర్తిగా గా డిజాస్టర్ అయింది. నిర్మాతలకు నష్టాలను తెచ్చిపెట్టింది. అలాగే మరో హీరో నాగార్జున, నాగార్జున కెరీర్ లో కూడా చాలా ఫ్లాప్ లు ఉన్నప్పటికీ ముఖ్యంగా అంతం, రక్షకుడు చిత్రాలు తీవ్రంగా నిరాశ పరిచాయి. భారీ అంచనాల మధ్య అంతం 1992 లో, రక్షకుడు 1997 లో రిలీజ్ అయ్యాయి. కానీ అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి.
ఉదయ్ కిరణ్ తో నటించిన ఈ నటులు అంత చని పోయారని తెలుసా ? వారికి అదే శాపమా ?
జూనియర్ ఎన్టీఆర్… జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో ఆంధ్రావాలా, శక్తి సినిమాలు ఫ్లాప్ గా నిలిచాయి. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఆంధ్రావాలా మెహర్ రమేష్ దర్శకత్వంలో వచ్చిన శక్తి సినిమాలు అప్పట్లో ఎన్టీఆర్ కు పెద్ద మైనస్ గా మారాయి.
ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ కెరీర్లో జానీ పెద్ద ఫ్లాప్ 2003 లో రిలీజ్ అయిన ఈ చిత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఆ తర్వాత కొమరంపులి కూడా డిజాస్టర్ గా మిగిలింది. 2018లో వచ్చిన అజ్ఞాతవాసి చిత్రం డిజాస్టర్ గా మిగిలింది. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కీర్తి సురేష్, అను ఇమ్మానియేల్ హీరోయిన్స్ గా నటించారు.
మధ్యలోనే ఆగిపోయిన పవన్ కళ్యాణ్ 4 సినిమాలు ఇవే!
మరో హీరో మహేష్ బాబు, మహేష్ బాబు ఖలేజా చిత్రం భారీ అంచనాల మధ్య రిలీజ్ అయింది. ఈ సినిమా త్రివిక్రమ్ దర్శకత్వం వహించగా అనుష్క శెట్టి హీరోయిన్ గా నటించింది. అయితే ఈ చిత్రం అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. ఫ్లాప్ గా నిలిచింది.
మరో హీరో ప్రభాస్, బాహుబలి తర్వాత భారీ అంచనాల మధ్య సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన సాహో అలాగే రాధాకృష్ణ దర్శకత్వంలో వచ్చిన రాధే శ్యామ్ ఈ రెండు సినిమాలు కూడా ఫ్లాప్ గా నిలిచాయి.