సినిమాల్లోకి అడుగుపెట్టాలి అంటే కచ్చితంగా హీరో అయితే మొదటి సినిమాతో హిట్ కొట్టి ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. వారసుడు అయినా కాకపోయినా సరే ఒక హిట్ అనేది కచ్చితంగా పడాల్సి ఉంటుంది. అయితే కొందరు హీరోలకు మాత్రం ఇది సాధ్యం కాలేదు. స్టార్ హీరోల నుంచి హీరోల వరకు మొదటి సినిమా దిష్టి మాదిరి పోయింది అనే చెప్పాలి. ఆ హీరోలు ఎవరు అనేది చూద్దాం.
జూనియర్ ఎన్టీఆర్
నిన్ను చూడాలని సినిమా యంగ్ టైగర్ కి షాక్ ఇచ్చింది. వీఆర్ ప్రతాప్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఏ మాత్రం అంచనాలు అందుకోలేకపోయింది అనే చెప్పాలి.
కళ్యాణ్ రామ్
తొలిచూపులోనే అనే సినిమాతో టాలీవుడ్ లోకి హీరోగా అడుగుపెట్టాడు కళ్యాణ్ రామ్. కాని ఆ సినిమా దారుణంగా ఫ్లాప్ అయింది.
ప్రభాస్
బాహుబలి సినిమాతో హాలీవుడ్ కి కూడా వెళ్ళిపోయిన ప్రభాస్ కు ఈశ్వర్ సినిమా షాక్ ఇచ్చింది. జయంత్ సి పరాన్జీ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో ప్రభాస్ మాస్ లుక్ లో కనిపించాడు.
నాగ చైతన్య
నాగ చైతన్య హీరోగా వచ్చిన తొలి సినిమా జోష్. ఈ సినిమాపై మంచి అంచనాలే ఏర్పడినా కథలో పట్టులేకపోవడంతో ఫ్లాప్ అయింది.
వరుణ్ తేజ్
వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన ముకుందా సినిమా దారుణంగా ఫ్లాప్ అయింది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ కంటే అతని పక్కన నటించిన యాక్టర్ కు మంచి పేరు వచ్చింది.
ఇలా అఖిల్, మంచు విష్ణు, గోపిచంద్ వంటి హీరోలకు మొదటి సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.