తెలుగు చిత్ర పరిశ్రమలో అక్కినేని నాగార్జునకు ప్రత్యేక స్టైల్ ఉంటుంది. ఆరు పదుల వయస్సులోనూ అదే అందంతో కుర్రకారును మెప్పిస్తుంటారు. ఇప్పటికీ తన లుక్ తో యువ హీరోలకు సవాల్ విసురుతుంటారు. అలాంటి నాగార్జునకు ఓ చిక్కొచ్చి పడిందట.
నాగ్ ప్రస్తుతం ‘వైల్డ్ డాగ్’ అనే యాక్షన్ ఫిలిం లో నటిస్తున్నారు. ఈ సినిమాలో ఆయన ఏసీపీ పాత్రలో కనిపించనున్నాడు. ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ గా ఆయన పవర్ ఫుల్ రోల్ ను పోషించనున్నారు నాగార్జున. అయితే ఈ సినిమాలో నటించేందుకు స్టార్ హీరోయిన్లను సంప్రదిస్తే నో చెప్పారట. హీరోయిన్లు ఆఫర్ ను తిరస్కరిస్తుండటంతో నిర్మాతలు మరో కథానాయిక కోసం అన్వేషణలో ఉన్నారు.
సీనియర్ హీరోలతో పోలిస్తే నాగ్ అన్నింట్లో ముందుంటాడు. ఫిట్ నెస్, లుక్స్ పరంగా ఆయన ఇంకా వయస్సును పెద్దగా కనపడనివ్వడు. అలాంటి స్టార్ హీరో నాగ్ సరసన నటించడానికి హీరోయిన్స్ అంగీకరించకపోవడానికి మరో కారణం ఉందట. సీనియర్ హీరోతో కలిసి నటిస్తే యువ హీరోల సినిమాల్లో ఛాన్స్ కొట్టేసే అవకాశం ఉండదని.. తమను ఎవ్వరు పట్టించుకోరని హీరోయిన్స్ భావిస్తున్నారట. అందుకే ఇష్టం ఉన్న నాగ్ సినిమాను పక్కన పెడుతున్నారని ఫిలింనగర్ టాక్.