బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుని మూడు సీజన్ లను పూర్తి చేసుకొని నాలుగవ సీజన్ లోకి అడుగు పెట్టిన రియాలిటీ షో బిగ్ బాస్. కాగా సీజన్4 ప్రారంభం కావటం చివరి దశకు చేరుకోవడంతో జరిగిపోయింది. ఇప్పుడు విజేత ఎవరో తెలిసిపోయే సమయం వచ్చింది. ఈనెల 20న గ్రాండ్ ఫినాలే జరగబోతోంది.
అయితే ఫైనల్ ను పెద్ద ఎత్తున నిర్వహించేందుకు షో నిర్వాహకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఫినాలే కు గెస్ట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు, మెగాస్టార్ చిరంజీవి ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు వస్తారు అని వార్తలు వస్తున్నాయి. మరోవైపు నివేదా పేతురాజ్ మెహ్రీన్, లక్ష్మీ రాయ్ లాంటి హాట్ హీరోయిన్స్ డాన్సులతో రచ్చ చేయనున్నారట. అందుకుగాను వీళ్ళకి రెమ్యూనరేషన్ కూడా కాస్త ఎక్కువగానే ముట్ట చెప్పినట్లు తెలుస్తోంది.