మన తెలుగు హీరోల రేంజ్ మారుతుంది..ఒకప్పుడు ప్రాంతీయ భాషగా గుర్తింపు పొందిన సినిమాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లు రాబడుతున్నాయి..మన హీరోలు కూడా ఒక్కో సినిమాకి కోట్లకి కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. మరి మన హీరోల రేంజ్ కి తగ్గట్టుగా వాడు వాడే కార్ల వివరాలేంటో చూద్దామా.?
చిరంజీవి:
మెగాస్టార్ చిరంజీవి దగ్గర ఇప్పటికే చాలా కార్ల కలెక్షన్ ఉంది..అయినప్పటికి ఎక్కువగా బయట వేడుకలకు రోల్స్ రాయిస్ ఫాంటమ్ కారుని ఉపయోగిస్తూ ఉంటాడు..దీన్ని చిరు బర్త్ డే కి గిఫ్ట్ గా రాంచరణ్ ఇచ్చాడు..దీని ధర సుమారు 3 కోట్లు.
మహేశ్ బాబు:
ప్రిన్స్ మహేశ్ బాబు ప్రస్తుతం ఉపయోగించే కారు రెండు కోట్ల విలువైన రేంజ్ రోవర్.. దీన్ని మహేశ్ భార్య నమ్రత గిఫ్ట్ గా ఇచ్చింది..
పవన్ కళ్యాణ్:
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దగ్గర కూడా రకరకాల కార్లు ఉన్నాయి..వాటిల్లో బెంజ్, స్కోడా ఉండగా.. ఇటీవల తెచ్చుకున్న ఆడి క్యూ 7 ప్రస్తుతం ఉపయోగిస్తున్నారు.. దీని ధర 90 లక్షలు.
రాంచరణ్:
కార్లంటే పడి చచ్చే వారిలో రాంచరణ్ ఒకరు..ఇప్పటికే అనేక రకాల లగ్జరీ కార్లు రాంచరణ్ దగ్గర ఉన్నాయి.. చరణ్ కార్ల సెలక్షన్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది..ఎంతైనా రేసర్ కదా ప్రస్తుతం రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ ఎడిషన్ వాడుతున్నాడు. చరణ్ ఉపాసనల వివాహానికి బహుమతిగా సుమారు 6 కోట్ల విలువైన ఆస్టన్ మార్టిన్ కారు బహుమతిగా లభించింది.
నందమూరి బాలక్రిష్ణ:
టాలివుడ్ డైనమిక్ హీరో బాలక్రిష్ణకు పెద్ద కార్లంటే పిచ్చి..అంతేకాదు పొలిటికల్ ర్యాలీ కి వెళ్లడానికి కూడా అవి ఉపయోగపడుతుంటాయి. ప్రస్తుతం కోటిన్నర విలువ కల BMW 7 సిరిస్ ఎడిషన్ వాడుతున్నాడు..తన లగ్జరీ కార్ల జాబితాలో పోర్ష్యే పనామెరా కూడా ఉంది.
రవితేజ:
క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుండి హీరోగా ఎదిగిన మాస్ మహరాజ రవితేజ దగ్గర మెర్సిడెస్ ఎస్ క్లాస్ కారు ఉంది..దీని ధర కోటిన్నర రూపాయలు.
ప్రభాస్:
బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన నటుడు ప్రభాస్ .. తన దగ్గర ప్రస్తుతం రోల్స్ రాయిస్ ఫాంటమ్ కారు ఉంది..దాని ధర 8 కోట్లు.
జూనియర్ ఎన్టీయార్:
ఎనర్జిటిక్ హీరో యంగ్ టైగర్ NTR కి కార్లు, బైక్లు అంటే ప్రత్యేక ఇష్టం..ఇప్పటికే ఎన్టీయార్ దగ్గర రకరకాల కార్లు, బైక్ల కలెక్షన్ ఉంది.. ప్రస్తుతం రెండున్నర కోట్లు విలువైన పోర్ష్యే 911 కారుని ఉపయోగిస్తున్నాడు.
అల్లు అర్జున్:
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ దగ్గర ప్రస్తుతం కోటి విలువ చేసే BMW X6 స్పోర్ట్స్ ఎడిషన్ కారు ఉంది.
సూర్య:
తమిళ నటుడు సూర్య తన సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తుంటాడు.. తెలుగు రాష్ట్రాల్లో కూడా అభిమానులను సంపాదించుకున్న తమిళ నటుడు సూర్య.. ఆడి కార్స్ సంస్థ ఆడి A7 కారు ప్రమోషన్ లో భాగంగా సూర్యకి బహుమానం గా ఇచ్చింది..దీని ధర సుమారు 90 లక్షలు.