లాక్ డౌన్ కారణంగా షూటింగ్ లన్నీ వాయిదా పడ్డాయి. సినిమాల్లాగే బుల్లితెర ఇండస్ట్రీ కూడా బాగా ఇబ్బందిపడుతుంది. దీంతో టీవీల్లో వచ్చిన ఎపిసోడ్స్ మళ్లీ వస్తున్నాయి. ఈ షూటింగ్ రద్దు కావటం వల్ల అసిస్టెంట్స్, టెక్నిషియన్లు, ఇతర కార్మికులకు ఇళ్లు గడవటమే కష్టంగా తయారయ్యింది.
అయితే… వీరి కోసం స్టార్ మా తనవంతు సహాయంగా 55లక్షల విరాళం ప్రకటించింది. దాదాపు 500-600మంది ఉంటారని అంచనా వేస్తూ ఈ సహాయం చేసినట్లు ఇండస్ట్రీ వర్గాలు ప్రకటించాయి.