ప్రముఖ యాంకర్ ఝాన్సీ బిగ్‌బాస్‌పై చేసిన కామెంట్స్ అసలుకే ఎసరు తెచ్చినట్లు కనపడుతోంది. అటు సినిమాలతో, ఇటు షోలతో బిజీగా ఉన్న ఝాన్నీ వివాదాల్లో చిక్కుకున్నట్లు కనపడుతోంది. రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 3 లో రాహుల్ గెలవటం పై ఝాన్సీ చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. అమెరికా లాంటి దేశంలోనే మహిళను అధ్యక్షురాలిగా చేయడానికి సిద్ధంగా లేనప్పుడు, బిగ్ బాస్ లో శ్రీముఖిని తెలుగు ప్రేక్షకులు ఎలా గెలిపిస్తారు అంటూ సోషల్ మీడియా లో రాసుకొచ్చింది.
అయితే ఝాన్సీ చేసిన కామెంట్స్ పై స్టార్ మా యాజమాన్యం గుర్రుగా ఉందని సమాచారం. ప్రస్తుతం స్టార్ మా లో ఝాన్సీ స్టార్ మ్యూజిక్ తెలుగు, స్టార్ట్ మా పరివార్ షో లను చేస్తుంది. బుధవారం బిగ్ బాస్ విన్నర్ పై చేసిన కామెంట్స్ కి ఝాన్సీ ని షో ల నుంచి తొలిగించాలని ఆలోచనలో స్టార్ మా ఉన్నట్టు తెలుస్తుంది. ఝాన్సీ పై మరి స్టార్ మా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.