మన తెలుగులో టాలెంట్ కు ఎప్పటికీ గుర్తింపు ఉండదు అంటారు చాలా మంది. తెలుగు సినిమాలో చాలా మంది అవకాశాల కోసం ఎదురు చూసి ఇతర భాషలకు వెళ్ళిపోయారు. ఇక కొందరికి అనుకోకుండా ఇతర భాషల్లో అవకాశాలు వచ్చి అక్కడ సెటిల్ అయ్యారు. అలా సెటిల్ అయిన వారి జాబితా ఒకసారి చూస్తే…
Also Read:ప్రైవేట్ బ్యాంకులు మంచివనే భావన ప్రజల్లో ఎందుకు ఉంటుంది…?
రవి శంకర్, అయ్యప్ప
సాయి కుమార్ తమ్ముళ్ళు ఈ ఇద్దరు. సాయి కుమార్ తెలుగులో పరిచయం అయినా సరే కన్నడంలో ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది. ఇక తమ్ముళ్ళు ఎక్కువగా కన్నడం లోనే సెటిల్ అయ్యారు. రవిశంకర్ తెలుగులో అప్పుడప్పుడు కనిపించారు. నాగార్జున ఢమరుకంలో విలన్ గా నటించి… అరుంధతిలో సోనూసూద్ కి డబ్బింగ్ కూడా చెప్పారు.
జానీ లివర్
హిందీ సినిమాలు చూసేవారికి ఈ పేరు పరిచయం అవసరం లేదు. ఈయనది ప్రకాశం జిల్లా ఒంగోలు.
దియా మిర్జా, అదితీరావు హైదరీ
ఈ ఇద్దరిది హైదరాబాదే. అయితే బాలీవుడ్ లో మంచి గుర్తింపు వచ్చింది వీళ్ళకు. అదితీ సమ్మోహనం సినిమాతో తెలుగులో కనపడినా దియా మీర్జా నటించలేదు.
ఆది పినిశెట్టి
హీరో, విలన్, అన్న పాత్రలు చేస్తూ ఇప్పుడు తెలుగులో అలరిస్తున్న ఈయన తమిళ సినిమాల్లో ఆకట్టుకున్నాడు. ఇక కన్న్నడం లో కూడా ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది.
విశాల్
తెలుగు వాడే అయిన ఈ తమిళ నటుడు… అక్కడ మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తమిళనాట ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది. ఇక తెలుగులో డైరెక్ట్ చేసిన సినిమాలు మాత్రం ఆకట్టుకోలేదు.
శ్రీరామ్
ఒకరికొకరు సినిమాతో తెలుగులో అలరించి ఆ తర్వాత తమిళనాడు వెళ్లి మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.
వైభవ్
డైరెక్టర్ కోదండరామిరెడ్డి కొడుకు అయిన ఈ నటుడికి కూడా తమిళంలోనే మంచి గుర్తింపు వచ్చింది.
జయం రవి
జయం రవి కూడా మన తెలుగు నటుడే. అయితే ఇక్కడ అవకాశాలు రాక అక్కడికి వెళ్లి మంచి ఛాన్స్ లు తెచ్చుకున్నాడు.
Also Read:తెలంగాణ.. పుట్టకముందే కత్తిగట్టిన పార్టీ బీజేపీ