సినిమా నటులు, డబ్బులు ఉన్న వాళ్ళు ఏం చేసినా చెల్లుతుంది అనే మాట వాస్తవం. వాళ్ళు ఏం చేసినా స్పూర్తిగానే ఉంటుంది జనాలకు. ఈ మధ్య కాలంలో పెళ్లి కాకుండానే తల్లి తండ్రులు అనే ట్రెండ్ ని తీసుకొచ్చారు. నయనతార, విజ్ఞేశ్ శివన్ పెళ్లి అయిన నాలుగు నెలలకే తల్లి తండ్రులు అయ్యారు. ఇప్పుడు అలియా భట్ విషయంలో కూడా దాదాపు ఇదే జరిగింది. ఇలా పెళ్లి కాకుండా గర్భం దాల్చిన వాళ్ళ లిస్టు చూద్దాం.
విజ్ఞేశ్ శివన్ – నయనతార
పెళ్లి అయిన నాలుగు నెలలకే సరోగసి ద్వారా తల్లి తండ్రులు అయ్యారు వీరు ఇద్దరూ. ఇది వివాదం అవుతుంది అని భావించినా చాలా వేగంగానే సద్దుమణిగింది అనే చెప్పాలి.
అలియా భట్ – రణబీర్ కపూర్
పెళ్లి అయిన ఏడు నెలలకే అలియా భట్ తల్లి అయింది. దీనిపై వివాదం లేకపోయినా సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు అని కొందరు మండిపడుతున్నారు.
వివిన్ రిచర్డ్స్ – నీనా గుప్తా
నీనా గుప్తా కూడా పెళ్లి కాకుండానే గర్భవతి అయింది. ఆ తర్వాత ఇది వివాదం అయినా సరే పెద్ద గొడవ కాకుండానే క్లోజ్ చేసారు. వీళ్ళ బ్రేకప్ స్టోరీ అప్పట్లో ఒక సంచలనం.
కమల్ హాసన్ – సారిక
మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే కమల్ హాసన్ సారికతో సహజీవనం చేసారు. ఇది పెద్ద గొడవే అయింది. ఆమె గర్భవతి కావడం కూడా జరిగింది. ఆ తర్వాత వీళ్ళు వివాహం చేసుకున్నారు.