ఇండస్ట్రీలో చాలామంది స్టార్స్ ఓ వైపు సినిమాలు చేస్తూనే మరో వైపు యాడ్స్ లో కూడా నటిస్తూ ఉంటారు. అయితే ఆయా కంపెనీలు కూడా అందుకు తగ్గట్టుగానే స్టార్స్ కి రెమ్యూనరేషన్ చెల్లిస్తూ ఉంటాయి. ఇక ప్రస్తుతం మాత్రం టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలు, హీరోయిన్స్ కూడా యాడ్స్ లో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
ఇప్పటికే ఆ లిస్టులో సూపర్ స్టార్ మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, నాగ చైతన్య, అల్లు అర్జున్, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ఇలా చాలా మంది ఉన్నారు. అయితే మరి కొంత మంది స్టార్ హీరోలు మాత్రం కార్పొరేట్ కంపెనీలు ఎంత డబ్బును ఆఫర్ చేసినా నో చెప్తూ ఉంటారు.
టాలీవుడ్ లో అలాంటి హీరోలు,హీరోయిన్స్ చాలామంది ఉన్నారు. మొదటిగా ఆ లిస్టు నందమూరి బాలకృష్ణ … బాలకృష్ణ ఇప్పటివరకు ఎలాంటి యాడ్ లో కూడా నటించలేదు. ఎన్నో పెద్ద పెద్ద కంపెనీలు ఆఫర్స్ ఇచ్చినప్పటికీ నో చెబుతూ వచ్చాడు. జనాలకు ఉపయోగపడే యాడ్ లను ఫ్రీగా చేస్తాను కానీ డబ్బు తీసుకొని జనాలకు అబద్ధాలు చెప్పే యాడ్ లను చేయనని కరాఖండిగా చెప్పారు బాలయ్య.
బాలయ్య నో చెప్పిన కథతో రికార్డ్స్ బ్రేక్ చేసిన మోహన్ బాబు.. ఆ సినిమా ఇదే !!
మరొక హీరో మోహన్ బాబు… మోహన్ బాబు తో కూడా యాడ్ చేసినందుకు చాలా కార్పొరేట్ కంపెనీలు ప్రయత్నించాయి. అయితే మోహన్ బాబు కూడా నో చెప్పాడు.
అలాగే నందమూరి కళ్యాణ్ రామ్. నందమూరి కళ్యాణ్ రామ్ హీరో గా అంత పెద్ద స్థాయిలో ఆకట్టుకోకపోయినప్పటికీ కళ్యాణ్ రామ్ కి కూడా కొన్ని యాడ్స్ లో నటించే అవకాశాలు వచ్చాయట. అయితే కళ్యాణ్ రామ్ వీటిని సున్నితంగా తిరస్కరించాడు.
అలాగే సీనియర్ నటి గౌతమి. ఒకానొక సమయంలో సౌత్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగిన గౌతమి కి కూడా చాలా ఆఫర్స్ వచ్చాయట. అయినా సరే ఆమె వదులుకుందట.
Sr.Ntr Wedding invitation: ఇప్పటి వరకు మీరెప్పుడు చూడని ఎన్టీఆర్ గారి పెళ్లి పత్రిక మరియు ఫోటోలు
ఇక ప్రజెంట్ సౌత్ స్టార్ హీరోయిన్ సాయి పల్లవి. ఒక ఫెయిర్నెస్ క్రీమ్ కంపెనీ సాయి పల్లవి కి మంచి ఆఫర్ ఇచ్చింది. సాయి పల్లవి మాత్రం అందుకు ఒప్పుకోలేదు. ఎన్ని కోట్లు ఇచ్చినా సరే తాను నటించనని చెప్పేసింది.
అలాగే మంచు విష్ణు… మంచు విష్ణుకి కూడా కెరీర్ స్టార్టింగ్ లో ఎన్నో యాడ్స్ లో నటించేందుకు ఆఫర్స్ వచ్చాయట. కానీ మంచు విష్ణు వాటిని వదులుకున్నాడు. అలాగే అతని తమ్ముడు మంచు మనోజ్ కూడా వచ్చిన యాడ్స్ ని వదులుకున్నాడు.
టాలీవుడ్ స్వీటీ అనుష్క… అనుష్క కూడా ఎన్నో కార్పొరేట్ కంపెనీలకు నో చెప్పిందట. ఎంత డబ్బులు ఇచ్చినా యాడ్స్ లో నటించేది లేదని తెలిపిందట.
అల్లరి నరేష్…. అల్లరి నరేష్ కూడా వచ్చిన యాడ్స్ ను వదులు కున్నాడట. ఎంత డబ్బు ఇచ్చినా యాడ్స్ లో నటించనని చెప్పాడట.
Advertisements
మెగా హీరో సాయి ధరమ్ తేజ్… సాయి ధరమ్ తేజ్ కి కూడా ఎన్నో కంపెనీలు యాడ్స్ లో నటించాలని ఆఫర్ ఇచ్చారట. కానీ సాయి ధరమ్ తేజ్ మాత్రం తనకు ఇష్టం లేదని చెప్పాడట. వీరితో పాటు చాలా మంది హీరో హీరోయిన్లు కూడా వచ్చిన అవకాశాలని వదులుకున్నారట.