అటు కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన మోడీ ఇటు రాష్ట్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేసే పనిలో ఉన్నారు. కేంద్రం ఇండియన్ ఎయిర్లైన్స్, రైల్వేస్, బి ఎస్ ఎన్ ఎల్ ఇలా పలు రంగాలను ప్రైవేట్ పరం చేస్తుంటే ఇటు కేసీఅర్ కూడా ఆర్టీసీని, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న రోడ్లను, చెత్త రవాణా ఇలా అనేక వాటిని ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్పాలని చూస్తున్నట్లు కనపడుతోంది.
ప్రభుత్వం ముందు మోకరిల్లిన ప్రశ్నించే పాట?
అయితే ఆర్టీసీ సుధీర్ఘ సమ్మె కారణంగా రూట్ల ప్రైవేటీకరణ తాత్కాలికంగా వాయిదా పడిందని చెప్పవచ్చు. హైదరాబాద్ లోని ఏడు వందల తొమ్మిది కిలోమీటర్ల పరిధిలోని రోడ్లు, ఫుట్ పాత్ లు, రోడ్ల శుభ్రత, గ్రీనరీ మెయింటెనెన్స్ లాంటి నిర్వహణ బాధ్యతను ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్పుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు టెండర్స్‌ను కూడా పిలిచారు. ఇందుకు సుమారు రెండు వేల కోట్లు కేటాయించారు. మరోవైపు చెత్త రవాణా బాధ్యతలను కూడా ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్పే ప్రయత్నంలో ఉన్నారని తెలుస్తుంది.
బ్యాంక్ ఖాతాదారుల బీమా కవరేజ్ లక్ష రూపాయలే
భవిష్యత్ లో ఇతర రంగాలకు కూడా ప్రైవేటీకరణ విస్తరిస్తుంది అనిది సుస్పష్టం. ఇదే జరిగితే చాలామంది ఉద్యోగాలు కోల్పోతారని, కొత్త ఉద్యోగాలకు అవకాశం ఉండదని విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ ఉద్యోగుల నియామకం కాంట్రాక్టు పద్ధతిలో, అవుట్ సోర్సింగ్ పద్ధతిలో నియమించడం ఏమిటని మండిపడ్డారు, ఇలా ఐతే ముఖ్యమంత్రి పదవిని కూడా కాంట్రాక్టు పద్ధతిలో నియమిస్తారా అనికూడా ప్రశ్నించారు. ఒకడుగు ముందుకేసి తెలంగాణ వస్తే ఈ పద్ధతికి స్వస్తి పలుకుతామని, ఉద్యోగ నియామకాలన్ని ప్రభుత్వమే చేస్తుంది అని కూడా చెప్పారు.
బడి పక్కన వైన్ షాపు..రోడ్డెక్కిన విద్యార్థులు
కానీ నేడు ఉన్న ఉద్యోగాలు ఊడే పరిస్థితి తెస్తున్నారని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్ని ప్రైవేటీకరణ చేస్తే ఇంకా ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కడ ఉంటాయని అంటున్నారు. అన్నిటిని ప్రైవేట్ వారికి కట్టబెట్టి తద్వారా వచ్చే కమీషన్ల తో తమ జేబులు నింపుకోవాలి చూస్తున్నారని మండిపడుతున్నారు. ప్రైవేటీకరణ ఆలోచనలను ఉపసంహరించుకోవాలని కోరుతున్నారు. మొదటివిడత ప్రభుత్వంలో మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ కాళేశ్వరం ఇలా అనేక ప్రాజెక్ట్ ల ద్వారా నిధులు సమకూర్చుకున్నారని… ఇప్పుడు ప్రైవేటీకరణ పేరుతో నిధుల సమీకరణ కు ప్రయత్నిస్తున్నారని చెప్పుకొస్తున్నారు. ఏదిఏమైనా ప్రభుత్వం ప్రైవేటీకరణ వైపు అడుగులు వేస్తుంది అని మాత్రం అర్థం అవుతోంది.