రాష్ట్ర బీజేపీ నేతల వీరోచిత మాటలాతో అమాయకులు బలవుతున్నారు. రాష్ట్రంలో ఏ సమస్య వచ్చిన మేమున్నాం అంటూ ముందుకు రావడం, దాన్ని మధ్యలోనే వదిలేయడం బీజేపీ నేతలకు ఆనవాయితీగా మారింది . డబుల్ బెడ్రుమ్ ఇండ్లు, ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలు, ఆర్టీసీ కార్మికుల సమస్యలు ఇలా ఏ సమస్యలపై అయినా మేము కేంద్రాన్ని కలుస్తాం, ప్రత్యక్ష పోరాటాలకు దిగుతాం కేసీఆర్ మెడలు వంచుతాం అని వీరోచిత మాటలు మాట్లాడిన రాష్ట్ర బీజేపీ నేతలు చివరకు ఈ పోరాటాలను నీరుగార్చారు.
ఈ మధ్య బీజేపీ నేతలు హడావిడి చేస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. ఒక్క సమస్యను కూడా పరిష్కరం దిశగా తీసుకెళ్లలేక పోయారు. ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై కేంద్రంలో ఫిర్యాదు చేశామని, రాష్టపతిని కలిసి ఫిర్యాదు చేశామని, విద్యార్థులకు న్యాయం జరుగుతుందని, తప్పు చేసినవాళ్ళకు శిక్షతప్పదు అని భారీ కామెంట్స్ చేశారు. తీరా చూస్తే అసలు తప్పు ఎవరిది కాదని కోర్టు తీర్పు చెప్పింది, కేంద్రం తీసుకున్న చర్యలు శూన్యం, విద్యార్థుల మరణాలకు కారణం అయిన వాళ్ళు ఉన్నారు.
ఇక ఆర్టీసీ కార్మికుల సమ్మె పై కూడా బీజేపీ నానా హంగామా చేసింది, రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అయితే కేంద్ర ప్రభుత్వ వాటా ఉంది, మా పర్మిషన్ లేకుండా కేసీఆర్ ఏమి చేయలేరు అని చెప్తు వచ్చారు. కేంద్రం మాత్రం సినిమా చూస్తూ వచ్చింది. ఆర్టీసీ కార్మికుల సమ్మె పై బీజేపీ ఒక కమిటీని కూడా వేసింది, జితేందర్ రెడ్డి, వివేక్ లతో. కమిటిలోని సభ్యులు ఏ రోజు కార్మికుల పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొనలేదు. నెలల తరబడి కోర్టులో కేసు నడుస్తున్న పట్టించుకోని కేంద్రం, అంత అయిపోయాక కేసీఆర్ తో ఫోన్ లో మాట్లాడడానికి ప్రయత్నించాం కానీ ఆయన లైన్ లోకి రాలేదు అని ఇంకా కార్మికులను భ్రమలో ఉంచే ప్రయత్నం చేస్తున్నారు.