కరోనా వైరస్ ప్రభావంతోనే స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేశామని, షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు నిర్వహించటం సాధ్యం కాదంటూ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి రమేష్ కుమార్ సీఎస్ నీలం సాహ్నికి లేఖ రాశారు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు నిర్వహించండంటూ సీఎస్ ఇటీవలే ఈసీకి లేఖ రాయటంతో… మూడు పేజీల ప్రత్యుత్తరాన్ని ఈసీ సీఎస్‌కు పంపింది.
తన లేఖలో ఘాటుగా స్పందించిన ఈసీ… మహారాష్ట్ర, బెంగాల్, ఒడిస్సా రాష్ట్రాల్లో కరోనా ప్రభావంతో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడినట్లు ఈసీ రమేష్ కుమార్ లేఖలో ప్రస్తావించారు. ఎన్నికలు వాయిదా పడ్డ అనంతరం తనపై చేసిన వ్యాఖ్యలు బాధ కలిగించాయన్న రమేష్ కుమార్… కేంద్ర నిధులు రాకుండా పోతాయన్న ప్రచారంపై కూడా స్పందించారు. తాను గతంలో ఆర్థికశాఖలో కూడా పనిచేశానని చెబుతూ… ఆర్థిక వ్యవహరాలపై తనకు పూర్తి అవగాహాన ఉందనే విషయాన్ని ప్రస్తావించినట్లైంది.
ఎన్నికల వాయిదా నిర్ణయం తీసుకునే ముందు కేంద్ర కుటుంబ ఆరోగ్యశాఖ సలహాను తీసుకున్నట్లు లేఖలో ప్రస్తావించారు ఈసీ రమేష్ కుమార్. ఈ లేఖ ద్వారా ప్రభుత్వానికి కౌంటర్ ఇవ్వటంతో పాటు తనపై వచ్చిన ఆరోపణలు తిప్పి కొట్టే ఉద్దేశంతోనే రమేష్ కుమార్ కాస్త ఘాటుగానే లేఖాస్త్రాన్ని సంధించినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
సీఎస్‌కు ఈసీ రాసిన లేఖ ఇదే…