రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఈసీ ఇచ్చిన షెడ్యూల్ పై హైకోర్టు కీలక ఉత్తర్వులిచ్చింది. కరోనా వ్యాక్సినేషన్ సమయంలో ఎన్నికల నిర్వహణ సరికాదంటూ…షెడ్యూల్ ను రద్దు చేసింది.
తాజాగా దీనిపై ఎన్నికల సంఘం అప్పీల్ కు వెళ్లింది. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని, ఈసీ ప్రణాళిక ప్రకారం ఎన్నికలు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలంటూ హౌజ్ మోషన్ పిటిషన్ వేసింది. ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ఆయా రాజకీయ పార్టీలతో చర్చించిన తర్వాతే షెడ్యూల్ ఇచ్చారన్న అంశాన్ని సింగిల్ బెంచ్ పరిగణలోకి తీసుకోలేదని తెలిపింది.
మరోవైపు ఇదే అంశంపై జరిగిన వ్యవహారాన్ని ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ గవర్నర్ దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఆయనకు అన్ని అంశాలను వివరించనున్నారు.