తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. కోర్టు స్టేల కారణంగా మున్సిపల్ ఎన్నికలు వాయిదా పడగా… వార్డుల విభజన, రిజర్వేషన్లపై హైకోర్టు ఓకే చెప్పటంతో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది.
జనవరి 8 నుండి నామినేషన్లు స్వీకరించబోతున్నారు. నామినేషన్లకు తుది గడువు జనవరి 10. జనవరి 22న పోలింగ్, 25న కౌంటింగ్ ఉండనుంది.