గుజరాత్ లో గల దేశ ఐక్యత విగ్రహాం… స్టాచ్యూ ఆఫ్ యూనిటీని అమ్మకానికి పెట్టారు. దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో… డాక్టర్లకు కనీస సదుపాయల కల్పన కోసం, కరోనా వ్యాధి సోకిన వారికి చికిత్స అవసరమైన ఆర్థిక నిధులను సమకూర్చేందుకు విగ్రహాన్ని అమ్మకానికి పెట్టామని, ధర 30వేల కోట్లుగా నిర్ణయిస్తూ OLX లో పెట్టేశారు.
అదేంటీ…? బీజేపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి, నెలకొల్పిన పటేల్ విగ్రహాన్ని ప్రధాని మోడీ ఉన్నప్పుడే అమ్మకానికి పెట్టడం ఏంటీ అని కంగారు పడుతున్నారా…? అమ్మకానికి పెట్టింది నిజమే కానీ పెట్టింది ప్రభుత్వం కాదు. ఎవరో ఆకతాయిలు.
దేశంలో ఓ వైపు కరోనా వ్యాధి విజృంభిస్తుంటే చికిత్స అందించేందుకు ప్రభుత్వాల దగ్గర నిధులు లేవనటం, డాక్టర్లకు కనీసం సదుపాయాలు కల్పించలేని స్థితిలో ఉన్నారన్న వార్తల నేపథ్యంలో… దేశం మొత్తం చర్చ జరిగేలా ఎవరో ఇలా చేశారు.
కానీ దీన్ని సీరీయస్ గా తీసుకున్న గుజరాత్ పోలీసులు… కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. దీంతో ఆన్ లైన్ యాడ్స్ సంస్థ OLX ఆ యాడ్ ను తమ సైట్ నుండి తొలిగించేసింది. గుజరాత్ స్థానిక పత్రికలో ఈ యాడ్ గురించి రావటంతో విషయం తొలిసారిగా బయటపడింది.