ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథ ఆధారంగా తెరకెక్కిన సైరా చిత్రం మంచి టాక్‌తో దూసుకపోతుండగా, రాజకీయ ప్రముఖులు కూడా సినిమా చూసి చిరంజీవిపై ప్రశంసలు గుప్పిస్తున్నారు. అయితే, సినిమా రిలీజ్‌కు ముందు తలెత్తిన ఉయ్యాలవాడ వారసులు- రాంచరణ్ మధ్య సెటిలెమెంట్ అంశం ఇంకా కొనసాగుతూనే ఉంది.
సినిమాకు ముందు నిర్మాత రాంచరణ్, మెగాస్టార్ చిరంజీవి చెప్పినట్లు మాకు తమకు తోచిన సహాయం చేసినా చాలని… వాళ్లు ఎంత ఇవ్వాలనుకున్నారో ఇప్పించండని, మేము డిమాండ్ ఏమీ చేయటం లేదని వేడుకుంటున్నారు. మాకు అన్యాయం చేయకండి, మేము చాలా కష్టాల్లో ఉన్నాము… ఆదుకోండని మద్యవర్తుల ద్వారా సమాచారం పంపిస్తున్నారు.
మరీ సినిమా హిట్‌తో సంతోషంగా ఉన్న చిరంజీవి, రాంచరణ్‌లు ఉయ్యాలవాడ వారసులను ఎవిధంగా ఆదుకుంటారో చూడాలి.