బాహుబలి దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో మల్టీస్టారర్ చిత్రంగా వస్తున్న సినిమా RRR. జనవరి 8న సినిమా రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ ఎప్పుడో ప్రకటించింది. అయితే అనుకోకుండా కరోనా వైరస్ ప్రభావంతో షూటింగ్ కు తాత్కాలికంగా బ్రేక్ పడింది.
ఇదిలా ఉంటే… ఇప్పటి నుండే సినిమా ప్రమోషన్ పై దృష్టిపెట్టింది రాంచరణ్, ఎన్టీఆర్ ద్వయం. ఓవైపు ప్రజలంతా కరోనా భయంతో టెన్షన్ లో ఉంటే, కరోనా నివారణ పేరుతో ఇద్దరు కలిసి ఓ వీడియో సందేశం బయటకు వదిలారు. అప్పుడే అంతా ఇది ప్రమోషన్ కోసమే అంటూ మండిపడ్డారు.
తాజాగా ట్విట్టర్ వేధికగా… నీకు నేను ఓ సర్ ఫ్రైజ్ గిఫ్ట్ పంపుతా, ముందుగా జక్కన్నకు పంపినా… అది మీకు ఎప్పుడు వస్తుందో చూడాలి అంటూ ఎన్టీఆర్ చరణ్ కు ట్వీట్ చేశాడు. ప్రతి స్పందించిన చరణ్… జక్కన్నకు పంపారా…? ఎంటీ నువ్వు ఆయనకు పంపావా…? ఇవ్వాళ వస్తుందా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.
అయితే, ఇదంతా సినిమాపై హైప్ చేసే ఉద్దేశమేనన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. ఇక కరోనా వైరస్ తో ఖాళీగా ఉండటం ఎందుకు అనుకున్నారో ఏమో… చరణ్, ఎన్టీఆర్ లు ఇప్పటికే డబ్బింగ్ పనులు మొదలుపెట్టారట. షూటింగ్ పూర్తయిన భాగానికి డబ్బింగ్ స్టార్ట్ చేయగా, కన్నడ-తమిళ్ లో ఎన్టీఆర్ స్వయంగా డబ్బింగ్ చెబుతున్నట్లు తెలుస్తోంది.