దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. ఉక్రెయిన్, రష్యాల మధ్య యుద్ధం కొనసాగుతున్నప్పటికీ.. మార్కెట్లు లాభాలను మూటగట్టుకోవడం గమనార్హం. ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే సూచీలు నష్టాల్లోకి జారుకున్నప్పటికీ.. రష్యా, ఉక్రెయిన్ లు చర్చలకు సిద్ధమవడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంటును బలపరిచింది.
దీంతో నేడు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 389 పాయింట్లు లాభపడి.. 56,247కి చేరుకుంది. నిఫ్టీ 136 పాయింట్లు పెరిగి.. 16,794 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్.. టాటా స్టీల్ 6.61, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 6.03, రిలయన్స్ ఇండస్ట్రీస్ 3.29, టైటాన్ 3.11, ఎన్టీపీసీ 2.46 వద్ద స్థిర పడ్డాయి.
టాప్ లూజర్స్ .. డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ -2.81, మహీంద్రా అండ్ మహీంద్రా -2.07, యాక్సిస్ బ్యాంక్ -2.05, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ -1.99, హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ -1.56 తో సరి పెట్టుకున్నాయి.