రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య ఏర్పడిన యుద్ద వాతావరణంలో లాభాలతో మొదలైన దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో మార్కెట్లు ఒత్తిడికి గురవుతున్నాయి.
ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 68 పాయింట్లు నష్టపోయి.. 57,232కి పడిపోయింది. నిఫ్టీ 28 పాయింట్లు కోల్పోయి.. 17,063 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్.. కొటక్ మహీంద్రా బ్యాంక్ 2.49%, టైటాన్ 1.88%, ఇండస్ ఇండ్ బ్యాంక్ 1.04%, మారుతి 0.87%, భారతి ఎయిర్ టెల్ 0.62% వద్ద స్థిర పడ్డాయి.
టాప్ లూజర్స్.. ఎన్టీపీసీ -1.55%, ఎల్ అండ్ టీ -1.13%, నెస్లే ఇండియా -0.93%, ఐసీఐసీఐ బ్యాంక్ -0.89%, హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ -0.67% తో సరిపెట్టుకున్నాయి.