ప్రతికూల పవనాలు వీస్తోన్న సమయంలో.. స్టాక్ మార్కెట్లు గురువారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 1,105 పాయింట్లు కుప్పకూలి 53,102కి పడిపోయింది.
నిఫ్టీ 314 పాయింట్లు క్షీణించి.. 15,926 వద్ద ట్రేడవుతోంది. అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితులు మార్కెట్లను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి.
ఐటీసీ, ఐచర్ మోటార్స్ షేర్లు మాత్రమే లాభాల్లో ఉన్నాయి. హిండాల్కో టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, టాటా స్టీల్, బజాజ్ ఫిన్ సర్వ్ షేర్లు అత్యధికంగా నష్టల్లో తేలాడుతున్నాయి.
మరోవైపు రాత్రి అమెరికా మార్కెట్లు కుప్పకూలాయి. ద్రవ్యోల్బణ గణాంకాలు వెల్లడి, నెగటివ్ గ్లోబల్ సెంటిమెంట్ లు మార్కెట్ల పతనానికి కారణం అంటున్నారు నిపుణులు. కాగా.. అమెరికా స్టాక్స్‌లో భారీ అమ్మకాలు చోటుచేసుకున్నాయి.