క్యాన్సర్ అనేది ప్రపంచానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న జబ్బు. క్యాన్సర్ బారిన పడిన తర్వాత పూర్తి స్థాయిలో కోలుకుని బయటకు రావడం అనేది ఒక సవాల్. ఎక్కడో ఒకరిద్దరు మినహా క్యాన్సర్ బారిన పడిన తర్వాత కోలుకునే అవకాశాలు ఉన్నాయి. చాలా మంది సామాన్యులకు క్యాన్సర్ చికిత్స అనేది తలకు మించిన భారం. ఇక ఇదిలా ఉంటే… మన దేశంలో ఒకరకం క్యాన్సర్ మాత్రం చాలా తక్కువగా ఉంటుంది.
అదే గ్యాస్ట్రిక్ క్యాన్సర్… ఇది ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో చాలా తక్కువగా ఉంటుంది. దానికి ప్రధాన కారణం ఏంటీ అంటే… మన ఆహార అలవాట్లే అని స్పష్టంగా చెప్పేశారు పరిశోధకులు. మన పూర్వికులు మనకు ఇచ్చి వెళ్ళిన అద్భుతమైన ఆహారపు అలవాట్లే ఆ క్యాన్సర్ నుంచి కాపాడుతున్నాయని చెప్పారు. పాశ్చాత్య దేశాలలో అధికంగా ప్రాసెస్ చేయబడిన ఆహారపదార్థాలతో ఈ క్యాన్సర్ బారిన ప్రజలు పడుతున్నారు అని గుర్తించారు.
డాక్టర్ మైఖేల్ హెర్షెల్ గ్రెగర్ దీనికి సమాధానం ఇస్తూ… చాలా దేశాల్లో ఆహారంలో పసుపు వాడటం లేదని… ఇతర ప్రాంతాలతో పోలిస్తే భారత్ లో పసుపు ఎక్కువగా వాడతారని పేర్కొన్నారు. భారతదేశంలోని మగవారితో పోలిస్తే అమెరికాలోని మగవారిలో 23 రెట్లు ఎక్కువ ప్రోస్టేట్ క్యాన్సర్ వస్తుందని గుర్తించారు. అన్ని రకాల క్యాన్సర్ లు కూడా భారత్ కంటే అమెరికాలో ఎక్కువగా ఉన్నాయని గుర్తించారు. మనతో పోలిస్తే 9 రెట్లు ఎక్కువ ఎండోమెట్రియల్ క్యాన్సర్ అమెరికన్లకు వస్తుందని… 7 నుండి 17 రెట్లు ఎక్కువ ఊపిరితిత్తుల క్యాన్సర్ వస్తుందని తెలిపారు. 7 నుండి 8 రెట్లు ఎక్కువ మూత్రాశయ క్యాన్సర్ వస్తుందని వెల్లడించారు.