ఏపి లో ప్రభుత్వమే వైన్ షాపులు నిర్హహించబోతున్న విషయం తెల్సిందే… కానీ ఇప్పుడు తెలంగాణ సీఎం కే సిఅర్ పేరుతో ఏపి లోని ఓ ప్రాంతంలో ఏకంగా వైన్ షాపు నడుస్తుంది.“కేసిఆర్ వైన్ షాప్” అనే పేరుతో గత కొంత కాలంగా నెల్లూరు జిల్లాలోని, వాకాడు మండలం, తూపిలిపాలెం అనే మత్సకార గ్రామంలో ఈ వైన్ షాప్ నడుస్తుంది. ఇది ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది.
ఈ షాపు కి ఈ పేరు పెట్టడానికి గల కారణాలను మా తొలివెలుగు ప్రతినిధి విజయ్ కుమార్ క్షేత్ర స్థాయిలో తెల్సుకునే ప్రయత్నం చేయగా కొన్ని ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి.
వైన్ షాప్ లైసెన్స్ గల వ్యక్తి పేరు కే. చెంగారెడ్డి కావడంతో… షాపు పేరు తన పేరు మీద వచ్చేలా “కేసిఆర్ వైన్ షాపు” అని పెట్టినట్లు తెలిసింది. ఈ వ్యక్తి వైసీపీ అభిమాని కావడం తో కేసిఆర్ వైన్ షాపు పేరుని కూడా వైసీపీ జెండా లో వున్న మూడు రంగులతో కనిపించేలా చేశాడట.
మొత్తానికి కెసిఆర్ వైన్ షాప్ రూపాయి ఖర్చులేకుండా రెండు రాష్ట్రాలలో తెగ ఫేమస్ అయిపొయింది.