తెలుగు చిత్ర పరిశ్రమలో డ్యాన్స్ కు ఉన్నటువంటి క్రేజ్ ఏంటో పెద్దగా చెప్పనక్కర్లేదు. అందులోను స్టార్స్ హీరోల నుంచి అభిమానులు మంచి ప్రదర్శనను ఆశిస్తుంటారు. టాలీవుడ్ లో అగ్రశ్రేణి హీరోగా పేరున్న మహేష్ బాబు తన నటనతో అభిమానులను మెప్పిస్తున్న డ్యాన్స్ ఫెర్ఫామెన్స్ విషయంలో మాత్రం వెనకబడే ఉన్నాడని స్వయంగా ఆయన అభిమానులే అంటుంటారు. మహేష్ బాబు తన కెరీర్ మొదట్లో డ్యాన్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న క్రమక్రమంగా ఆయన వెనకబడి పోయారని వార్తలొచ్చాయి. మహేష్ బాబు సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరూ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో మహేష్ బాబు డ్యాన్స్ విషయంలో స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకున్నాడని… ఆయన డ్యాన్స్ ప్రేక్షకుల మనస్సుకు హత్తుకుంటుందని చిత్ర యూనిట్ తెలిపింది. అయితే డ్యాన్స్ విషయంలో మహేష్ బాబు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడానికి గల ప్రధాన కారణం అనిల్ రావిపూడి కారణమట.
కమర్షియల్ మూవీ కాబట్టి మహేష్ బాబు నుండి మంచి డ్యాన్స్ ఉండాల్సిందేనని అనిల్ పట్టబట్టాడట. మొదట అనిల్ రావిపూడి మహేష్ బాబుపై ఒత్తిడి తెచ్చినా మహేష్ పట్టించుకోలేదని దాంతో… ఇక సీన్ అర్ధమైన అనిల్ రావిపూడి డ్యాన్స్ మాస్టర్లతో మహేష్ బాబు బడీ లాంగ్వేజ్ కు సెట్ అయ్యేలా స్టెప్స్ ను డిజైన్ చేసినట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు డ్యాన్స్ దుమ్ము రేపుతుందని చిత్ర యూనిట్ చెప్తుంది. మహేష్ బాబు డ్యాన్స్ విషయంలో అభిమానులను ఎంతవరకు అలరిస్తాడో చూడాలి.